అరకు: ఉపాధిహామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ
అరకులోయ మండలం, చొంపి పంచాయితీలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీడీఓ వీసం ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ మేరకు ఖండిత కంధకాల పనులు చేస్తున్న ఉపాధి వేతనదారులతో ఎంపీడీఓ మాట్లాడారు. ఉపాధి పనిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐవిఆర్ఎస్ కాల్స్, స్వీయ గణన పై అవగాహణ కల్పించారు. పంచాయితీ కార్యదర్శి ఫరూక్, టీఏ పాంగి రమణ ఉన్నారు.