logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ శాఖలపై కలెక్టర్ సమీక్ష*

కామారెడ్డి ప్రతినిధి
తేది:22-04-2026

ఉమ్మడి జిల్లా బుధవారం

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ శాఖలపై కలెక్టర్ సమీక్ష*

వసతి గృహాలు, గురుకులాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి - కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా SC, ST, BC, మైనారిటీ సంక్షేమ శాఖలు చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

*జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ,* సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల కార్యాచరణ రూపొందించామని తెలిపారు.

*మొదటి రోజు:* జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, KGBVలను మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

*రెండవ రోజు:* వసతి గృహాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, ఆటల పోటీలు వంటి వివిధ రకములైన పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో *5,009 మంది* విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని కలెక్టర్ వెల్లడించారు.

*మూడవ రోజు:* వసతి గృహాలను ఇంజనీరింగ్ అధికారులు తనిఖీ చేసి, కావలసిన మైనర్ మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భవనాల లీకేజీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

సంక్షేమ వారంలో జరగబోయే మిగతా కార్యక్రమాలను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి, రోజువారీ నివేదికలను వెంట వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సంక్షేమ హాస్టళ్లలో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఇందులో ఎలాంటి అలసత్వం సహించబోమని కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగవాన్ స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో *DSCDO, DBCDO, DEO, DTWO, DPO, EE PR* మరియు బాన్సువాడ *CPO* సిబ్బంది పాల్గొన్నారు.

38
1568 views

Comment