ఆదోని న్యూస్: హరివానం నుండి హనవాల్ వరకు మూడు కోట్లతో బి. టి. రోడ్డు నిర్మాణం
ఆదోని న్యూస్ : హరివానం నుండి హనవల్ గ్రామ వరకు బిటి రోడ్డు శాంక్షన్ చూపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఆదోని టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ మీనాక్షి నాయుడు అన్నగారి నివాసంలో ఘనంగా సన్మానించారు.హనవల్ గ్రామం నుండి పెద్ద హరివనం వరకు సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డును శాంక్షన్ చేయించడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మీనాక్షి నాయుడు అన్నగారికి శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు.*
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు మీనాక్షి నాయుడు అన్నగారేనని కొనియాడారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని కోరారు.