logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు తొలి వేడుకలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు తొలి వేడుకలు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంతో మొదలయాయ్ . ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం బీచ్ రోడ్ లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ లో .ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 6:00 గంటలవరకు .అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగాయి. ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ పరిధిలోని అన్ని విభాగాలకు చెందిన పూర్వ, ప్రస్తుత విద్యార్థులు అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు ప్రస్తుత విద్యార్థులు అధ్యాపకుల మార్గ నిర్దేశకత్వం లో చక్కని స్టాల్ ఏర్పాటు చేశారు . అందరినీ ఆకట్టుకున్న ఆ స్టాల్ హాస్టల్ అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుత, పూర్వ విద్యార్థులు దేశ నాయకుల వేషధారణతో ఉదయం నుండి సాయంత్రం వరకు కన్వెన్షన్ సెంటర్ లో సందడి చేశారు. వారితో విద్యార్థులు ఫోటోలు తీసుకున్నారు.
థియేటర్ ఆర్ట్స్ పూర్వ విద్యార్థులు వేదిక మీద ప్రదర్శన ఇచ్చి ఆహుతులను అలరించారు. మన పూర్వ అధ్యాపకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ మల్లెల గారు ఆలపించిన పద్యాలు సభా ప్రాంగణం కరతాల ధ్వనులతో మారు మ్రోగింది.
సీనియర్ అధ్యాపకులు .డాక్టర్ మరపట్ల భాస్కరరావు మార్గ దర్శకత్వంతో ప్రస్తుత, పూర్వ విద్యార్థులు క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొని బాధ్యత నిర్వహించడం జరిగింది. థియేటర్ ఆర్ట్స్ విభాగం నుండి 15 మంది శతాబ్ది పురస్కారాలు కూడా అందుకోవడం విశేషం.

26
2039 views

Comment