మేమెంతో మాకు అంత వాట
*మేమెంతో మాకు అంత వాటా*
మేమెంతో మాకు అంత వాటా కావాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోయిన సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక టీమ్. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపాదించిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ఆధిపత్య వర్గాల మహిళలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం కలగదని ఆమె అన్నారు. దేశ జనాభాలో వున్న మహిళల జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ప్రత్యేక కోట ఇవ్వాలని ఆమె తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ముందుగా వెనుకబడిన తరగతుల వారి జనాభా లెక్కలు తేల్చి ఆ తర్వాత భారతదేశంలోని మొత్తం జనాభాలో 50% పైగా ఉన్నటువంటి మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాటా ప్రకారం మేము ఎంత మంది ఉన్నామో మాకు అంత వాటా రిజర్వేషన్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు తెస్తే బాగుంటుందని ఆమె అన్నారు. నిజంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా వర్గాల జనాభా లెక్కలు తేల్చిన తర్వాతనే రిజర్వేషన్ బిల్లు గురించి ఆలోచన చేయాలని అని ఆమె అన్నారు. ఆధిపత్య కులాల మహిళలకు ఉపయోగపడే బిల్లు వీగిపోయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆమె తెలిపారు.