logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో జర్నలిజం విభాగంలో పూర్వ విద్యార్థి, సాలూరు వాసి పి ఆర్ ఓ. డాక్టర్ రేగాన షణ్ముఖ రావు కు అవార్డు*


సాలూరు, ఏప్రిల్ 21 Aima Media న్యూస్;
ఆంధ్ర విశ్వకళాపరిషత్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆంధ్ర విశ్వ విద్యాలయం కన్వెన్షన్ హాలు లో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో కార్యక్రమం లో సాలూరు పట్టణo, చిన్న వీధి కి చెందిన అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రేగాన షణ్ముఖ రావు కు జర్నలిజం విభాగంలో పూర్వ పరిశోదక విద్యార్ధిగా, సమాచార పౌర సంబంధాల శాఖ మరియు షెడ్యూల్ కులాల స్థితి గతుల పై అధ్యయనాలు, పరిశోధనల్లో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జలాది రవి, ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయo వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డి వి ఆర్ మూర్తి, ఆంధ్ర విశ్వవిద్యాలయo జర్నలిజం విభాగం విభాగధిపతి ప్రొఫెసర్ వినయ్ కుమార్ ల చేతుల మీదుగా పి ఆర్ ఓ డాక్టర్ రేగాన షణ్ముఖ రావు కి శాలువా కప్పి, శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికను అందజేశారు. ఎయు శతాబ్ది ఉత్సవాల్లో తగిన గుర్తింపు లభించినందుకు సాలూరు మండలంలో పలువురు ఆయనను అభినందించారు.
డాక్టర్ రేగాన షణ్ముఖ రావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర కేసరి వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి మరియు జర్నలిజం విభగాం ప్రొఫెసర్ వినయ్ కుమార్ ల మార్గదర్శకత్వంలో జర్నలిజంలో పీ.హెచ్.‌డీ చేశారు. “డిఫ్ఫ్యూషన్ అఫ్ ఇన్నోవేషన్ ఎమంగ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ పాపులేషన్ ” అనే అంశంపై ఆయన చేసిన పరిశోధన వినూత్నంగా గుర్తింపు పొందింది.
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో విశిష్ట కీర్తి సాధించిన పూర్వ విద్యార్థులను సత్కరిస్తోంది.

240
8801 views

Comment