logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొత్తూరు సుబ్బరాయుడు ఆలయ అభివృద్ధికి 50 వేలు విరాళం: ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.

పాణ్యం (AIMA MEDIA ): ప్రముఖ శైవక్షేత్రం లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము ఆలయము అభివృద్ధి నిమిత్తం భక్తులు రూ.50 వేల 116-/లు విరాళంగా సోమవారం సమర్పించినట్లు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. బనగానపల్లె మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన టి.వెంకటరామయ్య కుమారుడు, కోడలు, మనవడు టి.నాగ శేఖర్ టి.జయలక్ష్మి, జయాన్స్ సూర్య వారికి శ్రీ స్వామివారు ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడిగా 50,116-/లు విరాళంగా సమర్పించారు. వారికి ఆలయ మర్యాదలతో శ్రీ స్వామివారికి అభిషేకము, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి, స్వామివారి శేష వస్త్రములు, పూలమాలలతో ఘనంగా సత్కరించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, గ్రామ సేవకుడు సుబ్బరామయ్య, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

2
67 views

Comment