బుగ్గారం లో బడిబాట
గల్లీ - గల్లీ లో విద్యార్థుల ర్యాలీ
బుగ్గారం లో బడిబాట
గల్లీ - గల్లీ లో విద్యార్థుల ర్యాలీ
బుగ్గారం:
ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండి, వారి ఉజ్వల భవిష్యత్ ను తీర్చిదిద్దుతాం అంటూ బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, పూర్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థిని - విద్యార్థులతో ఉపాధ్యాయినీ - ఉపాధ్యాయులు, అంగన్ వాడి టీచర్ లు గల్లీ - గల్లీ కి వెళ్లి ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో ప్రధానోపాధ్యాయులు అన్నాడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, శిక్షణా నైపుణ్యం తో అనుభవం గల బోధనా టీచర్ల గూర్చి వివరించారు. బుగ్గారం సర్పంచ్ నక్క రాజవ్వ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటి ప్రతినిధులు, పూర్వ విద్యార్థి, సామాజిక కార్యకర్త, విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.