logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లా పంచాయతీ పి.ఐ.ఓ. కు నోటీసులు కమీషన్ ఆర్డర్ ధిక్కరణ పై 22న విచారణ జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా బేఖాతర్

జిల్లా పంచాయతీ పి.ఐ.ఓ. కు నోటీసులు

కమీషన్ ఆర్డర్ ధిక్కరణ పై 22న విచారణ


జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా బేఖాతర్

అవినీతి మత్తులో అధికారులు

జగిత్యాల జిల్లాలో జోరుగా....
చట్టాల ఉల్లంఘన, తీర్పుల బేఖాతర్


బుగ్గారం / జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోని ప్రజా సమాచార అధికారికి తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నుండి నోటీసులు జారీ అయ్యాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త, సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి
2022 మే 17 న జిల్లా పంచాయతీ కార్యాలయం నుండి సమాచారం కావాలని సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు చేశారు. జిల్లా పంచాయతీ అధికారులు అట్టి సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. కేసు విచారణ జరిపి, ఇరువర్గాల వాదోపవాదాలు పరిశీలించిన సమాచార కమీషన్ 2023 ఫిబ్రవరి 16 న ఇట్టి పూర్తి సమాచారం దరఖాస్తు దారునికి ఇవ్వాల్సిందేనని 15 పిర్యాదులపై ఒకేసారి తీర్పు ప్రకటిస్తూ... ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇదే విషయమై పలు సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కూడా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోని పీఐవో కు పలు సందర్భాల్లో ఉత్తర్వుల నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయినా నేటి వరకు ఆర్టీఐ కార్యకర్త కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
తెలంగాణ రాష్ట్ర సమాచారం కమీషన్ ఇచ్చిన ఆర్డర్ ను ధిక్కరించి సమాచారం ఇవ్వడం లేదని దరఖాస్తు దారుడు చుక్క గంగారెడ్డి మళ్ళీ కమీషన్ కు పిర్యాదు చేశారు. ఈ ఆర్డర్ ధిక్కరణ పిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోని పీఐవో కు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 22 బుధవారం ఉదయం : 10-00 గంటలకు కమీషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ జారీ చేసిన ఆర్డర్ లను ధిక్కరించి, చట్టాలను ఉల్లంఘిస్తున్న జిల్లా పంచాయతీ అధికారులపై చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్తలు కోరుతున్నారు.
అవినీతి మత్తులో జిల్లా పంచాయతీ అధికారులు మునిగి ఉండడం వల్లనే సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జగిత్యాల జిల్లాలో జోరుగా....
చట్టాల ఉల్లంఘన, తీర్పుల బేఖాతర్ జరుగుతోందని పిర్యాదు దారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జగిత్యాల జిల్లా పాలనాధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది.

0
0 views

Comment