logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తనపై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి

తనపై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి....

ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి

కడప ఏప్రిల్ 20

గిరిజనులైన తనపై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీసులు తక్షణ చర్యలు చేపట్టాలని ట్రైబల్‌ ఫెడరేషన్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి కోరారు. సోమవారం ఆమె ఎస్పీ కార్యాలయం స్పందన లో జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జనవరి నెల 14వ తేది ఎస్టి కులానికి చెందిన తమ వారిపై అగ్రవర్ణాల వారు దాడి చేశారని, ఈ విషయంగా బాధితులైన వారు తన దగ్గరకు వచ్చి న్యాయం చేయాలని కోరారు. వారి విషయంపై పోలీసు స్టేషన్ కి వెళ్లి న్యాయం చేయమని అధికారులు కోరానన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు శంకర్ రెడ్డి నాగేశ్వర్ రెడ్డి శివ నారాయణ రెడ్డి లు తమ పట్ల కక్ష కట్టి తను మహిళని చూడకుండా అవమానంగా మాట్లాడి ఇబ్బంది పెడుతున్నారన్నది. ఇదివరకే స్పందన లో ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వారి వల్ల తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. కావున తమపై కక్ష కట్టి ఇబ్బందులు గుర్తించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరుతున్నానన్నారు.ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

0
77 views

Comment