logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కలిసిన మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్

ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా నేడు నెల్లూరులోని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ గారు తనకు అప్పగించిన బాధ్యతలపై కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు గారు, వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మవులూరు శ్రీనివాసులురెడ్డి గారు, వైసీపీ జిల్లా కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి గారు, నియోజకవర్గ YSRTUC అధ్యక్షులు బిరదవోలు రూప్ కుమార్ రెడ్డి గారు, కోరుటూరు సర్పంచ్ పామంజి శ్రీనివాసులు గారు మరియు వైసీపీ నాయకులు షేక్ ఏజియాస్, షేక్ షాహుల్, షేక్ జిలాని, షేక్ లతీఫ్, షేక్ రియాజ్, షేక్ ఖాదర్ భాషా, షేక్ ముష్టాక్, షేక్ సాజీద్, విష్ణు, అర్జున్, చరణ్, రాజ్ తదితరులు పాల్గొన్నారు.

1
0 views

Comment