logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బుచ్చిరెడ్డి పాలెంలో శోకసంద్రం – తన్నీరు సరోజినమ్మ మృతి, కుటుంబానికి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సానుభూతి

కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెం మునిసిపాలిటీ పరిధిలోని టి.ఎన్.ఆర్ కళ్యాణమండపం అధినేత తన్నీరు నరసింహారావు గారి సతీమణి తన్నీరు సరోజినమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా నేడు 18వ వార్డు లోని వారి నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నరసింహారావు గారిని, వారి కుమారులు తన్నీరు ప్రభాకర్, తన్నీరు ప్రసాద్, తన్నీరు భాస్కర్ లను మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో బుచ్చి మునిసిపాలిటీ వైసీపీ అధ్యక్షులు షేక్ షాహుల్ గారు, బుచ్చి రూరల్ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి గారు, కౌన్సిలర్లు మోర్ల జయంతి గారు, కందుకూరు యానాది రెడ్డి గారు, వైసీపీ నాయకులు మోర్ల భారత్ గారు, కడివేటి శ్రీనివాసులు రెడ్డి గారు, పి. పెంచలయ్య గారు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

0
0 views

Comment