మంత్రి జి.సంధ్యారాణికి శుభాకాంక్షలు తెలిపిన గుమ్మా నాగార్జున ఇతర జనసేన నేతలు...
ఇటీవల పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులైన శుభ సందర్భంగా మంత్రి గుమ్మిడి. సంధ్యారాణి కి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది... సోమవారం ఉదయం సంధ్యారాణి క్యాంపు కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ ,జనసేన 5వ వార్డ్ కౌన్సిలర్ ప్రతినిధి గుమ్మా నాగార్జున,4వ వార్డు మాజీ కౌన్సిలర్ గొల్లపల్లి
వరప్రసాద్, రెల్లివీధి పెద్దలు నిమ్మకాయల విజయ్ కుమార్, జనసేన నాయకులతో కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 4,5వ వార్డుల అభివృద్ధి , భవిష్యత్తు కార్యాచరణ కోసం చర్చించడం జరిగిందని తెలిపారు.