logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హైదరాబాద్‌లోని ప్రెస్ అకాడమీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని, సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల సేవలు ఎంతో ముఖ్యమని కొనియాడారు.

ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలు, సౌకర్యాలను మరింత విస్తరించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టులకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

3
78 views

Comment