భద్రాచలం డివిజన్ తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, AP CM నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు
భద్రాచలం, 20.04.2027
సోమవారం 10 గంటల 30 నిమిషాలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు ఆశీర్వచనము చేయించడం జరిగినది. పునుగునోల గోత్రం నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి మరియు దేవాన్సు పేరిట ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది ఈ సందర్భంగా భద్రాచలం పట్టణానికి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారని, భద్రాచలం కరకట్ట నిర్మాణం, రామాలయం అభివృద్ధి, భద్రాచలం నుండి లొట్టిపిట్ట గండి వరకు రోడ్ల నిర్మాణం, PHC ల నిర్మాణం, వాటర్ ట్యాంకులనిర్మాణం, శబరి వద్ద బ్రిడ్జి నిర్మాణం, తాళి పేరుపై చర్ల వద్ద బ్రిడ్జి నిర్మాణం,భద్రాచల పట్టణంలో కరకట్ట నిర్మాణం, నాలుగు రోడ్ల వెడల్పు సెంట్రల్ లైటింగ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని నాయకులు కార్యకర్తలు స్మరించుకున్నారు అని తెలుగుదేశం పార్టీ మహబూబాద్ పార్లమెంటు సభ్యుడు కొడాలి శ్రీనివాసన్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాళ్లూరు చిట్టిబాబు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు రేపాక రాంబాబు,కార్యదర్శిలు ఆదినారాయణ, రాజమండ్రి అచ్యుతరావు, వీక చిట్టమ్మ, నూటలపాటి దాసయ్య, పోటు వెంకటేశ్వర్లు, కొండవీటి అశోక్, ఎం.వెంకటేశ్వర్లు,కొండవీటి చిరంజీవి, కొండవీటి రమేష్ కొర్లపాటి రాము తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.