వడ్లకొనుగోలుసెంటర్లను ఓపెన్ చేయాలి
రైతులకురైతుబీమా రాష్ట్రప్రభుత్వం కల్పించాలి,
ప్రజా వాయిస్ ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా లో రైతులు ఆరుగాలాలు పండించి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఆరబెట్టుకోవడం జరుగుతుంది దాదాపు 15 నుండి 20 రోజులు అవుతుంది ఇప్పటివరకు అధికారులు గాని ప్రభుత్వము గానీ రైతుల విషయంలో పట్టించుకోవడంలేదు విషయం చాలా బాధాకరం ఎందుకంటే వర్షాలు ఈదురుగాలులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కనీసం వచ్చిన పంటను తొందరగా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులకు కొంత ఉరట కలుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పటికే వీర్నపల్లి మండలం కోనరావుపేట మండలంలో మరిమడ్ల లో విపరీతమైన రాళ్ల వర్షం పడి చేతికొచ్చిన పంట నేలపాలైనది రైతులను వెంటనే ఆదుకోవాలి రైతు కంటతడి పెడితే ఈ ప్రభుత్వాలు బాగుపడదని జగమెరిగిన సత్యం అందుకని ఈ జిల్లా కలెక్టర్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైస్ మిల్లర్ల యాజమాన్యంతో మాట్లాడి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్లు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా దించే విధంగా అధికారులు మాట్లాడాలని రైతుల పక్షాన కోరుచున్నాము ఈ దేశానికి వెన్నుముకైనా రైతే రాజు అది ఆచారంలో అమలవడం లేదు కానీ మాటల వరకు పేపర్ల వరకు చెప్పడానికే సరిపోతుంది ప్రతి పంటకు రైతు బీమా ఇవ్వాలి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం
ఖానాపురం లక్ష్మణ్ మాదిగ ఎంఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు.