logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చంద్రబాబు ఆశయాలే మాకు మార్గదర్శకం: ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.

AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సోమవారం ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్నా క్యాంటీన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి, అక్కడికి వచ్చిన పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ.76 ఏళ్ల వయసులో కూడా అలసట లేకుండా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు పనితీరు ప్రతి ఒక్క కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విజన్ ఉన్న నాయకుడిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించగల సత్తా ఒక్క చంద్రబాబు కే ఉందని ఆమె స్పష్టం చేశారు.గత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మూసివేసి అన్యాయం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప నిర్ణయం అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభమని, దీనివల్ల వేలాది మంది పేదలకు ఆకలి తీరుతోందని అన్నారు. ఆళ్లగడ్డ ప్రజల తరపున ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తూ, ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన ప్రియతమ నాయకుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలు మరిన్ని దశాబ్దాల పాటు అందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మండల స్థాయి ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

43
1451 views

Comment