logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంతర్రాస్టీయా ఒలంపియాడ్ మేధాశక్తి గణితం పరీక్షలలో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అహ్మద్

అంతర్రాస్టీయా ఒలంపియాడ్ మేధాశక్తి గణితం పరీక్షలలో ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన పాత మసీదు మౌజన్ షేక్ మహ్మద్ షరీఫ్ శ్రీమతి హసీనాల కుమారుడు షేక్ అహ్మద్ రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని మరియు మౌలానా అజీజ్ కుమార్తెలు అయినియా అయాన్ ఇంటర్నేషనల్ టైక్వాండో పోటీలలో గతంలో గోల్డ్ సిల్వర్ సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని నేడు ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ అరుణోదయ యుపి స్కూల్లో కరస్పాండెంట్ మరియు అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం యూనిట్ అధ్యక్షులు టి అమీర్ భాష, ఆళ్లగడ్డ మండలం ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ పట్టణ సిఐ గారు జి నాగరాజరావు సార్ గారు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ షేక్ హుస్సేన్ భాష అతిథిగా, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు ఏ మహబూబ్ బాషా మరియు అరుణోదయ స్కూల్ హెడ్మాస్టర్ కే మామ్ హుస్సేన్ మరియు డాక్టర్ ఓవైసీ అతిథిగా విచ్చేసి ఎల్కేజీ నుండి ఆరో తరగతి వరకు ఈ పాఠశాలలోనే చదివి ఏడవ తరగతిలో ఏలూరులోని మూలన అబ్దుల్ కలాం ఆజాద్ హై స్కూల్లో ఏడవ తరగతి ఈ సంవత్సరమే ప్రవేశం ఐ దాదాపు 850 పాఠశాలలు నుండి 14000 విద్యార్థులు పాల్గొన్న ఇ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో అపుస్మ షార్ట్ 2026 లో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు సీఐ సార్ గారు అభినందించి శాలువా పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరిగింది అలాగే టైక్వాండ క్రీడాకారులను శాలువాతో పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సభను ఉద్దేశించి విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ అహ్మద్ రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడము ఆళ్లగడ్డకే గర్వకారణము విద్యార్థి యొక్క మేధాశక్తి నైపుణ్యత చదువు పట్ల శ్రద్ధ అభినందనీయమని నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు విద్య మనిషికి జ్ఞానం సంపద ఇచ్చే మహోన్నతమైన ఆయుధమని విద్యాసంస్థలు విద్యార్థులకు సంస్కారంతో కూడిన విలువలతో కూడిన దేశభక్తితో కూడిన విద్యను అందించి సమాజానికి మంచి పౌరులను అందించే బాధ్యత ఉపాధ్యాయులదని కోరారు ఈ సందర్భంగా అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం యూనిట్ అధ్యక్షులు టి అమీర్ బాషా మాట్లాడుతూ ఆళ్లగడ్డ చదువుల గడ్డ ఆళ్లగడ్డ క్రీడల గడ్డ ఆళ్లగడ్డ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో విద్యలోనూ క్రీడలలోనూ అనేక రంగాల్లో రాణిస్తూ జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి నేషనల్ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఆళ్లగడ్డ కే గర్వకారణం అన్నారు మాజీ కౌన్సిలర్ హుస్సేన్ భాష మాట్లాడుతూ ఆళ్లగడ్డ విద్యార్థి రాష్ట్రస్థాయిలో మేధాశక్తి పరీక్షల్లో రెండవ స్థాయి రావడం ఆళ్లగడ్డకు తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తెచ్చినందుకు అభినందించి ముందు ముందు మహోన్నత స్థాయిలో ఎదగాలని సూచించారు ఆళ్లగడ్డ మండలం ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ సాదిక్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి ఫలితాలు రావడానికి ఈ విజయాలే స్ఫూర్తి అన్నారు విద్యార్థులు చదువుతోపాటు జీవన విధానాన్ని మంచి మార్గంలో ధార్మిక మార్గంలో పయనిస్తూ సమాజ హితం కోసం పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ సార్ గారి కి శాలువతో పూలమాలతో సన్మానించడం జరిగింది

28
1044 views

Comment