logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*ఆమదాలవలసలో CM చంద్రబాబు నాయుడు* *గారు జన్మదిన వేడుకలు ఘనంగా* *నిర్వహించిన ఎమ్మెల్యే కూన* *రవికుమార్ గారు...

AIMA న్యూస్ :
ఆమదాలవలసలో CM చంద్రబాబు నాయుడు* *గారు జన్మదిన వేడుకలు ఘనంగా* *నిర్వహించిన ఎమ్మెల్యే కూన* *రవికుమార్ గారు....*

✅ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆముదాలవలస పట్టణంలో ఆనందోత్సాహాల మధ్య ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరిపారు.

✅ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ గారు కేక్ కట్ చేసి సీఎం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు నిలుస్తున్నారని పేర్కొన్నారు.

✅అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచిత అన్నదానం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని సంబరాలను జరుపుకున్నరు,కేక్ కటింగ్ అనంతరం చంద్రన్న జయహో నినాదాలతో సభా ప్రాంతం మార్మోగింది.

6
846 views

Comment