logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాజాం సెంటాన్స్ (అమెరికన్ హాస్పిటల్) హాస్పిటల్‌లో మెగా ఉచిత వైద్య శిబిరం



విజయనగరం జిల్లా.రాజాం.

సెయింట్ ఆన్స్ ఆసుపత్రితో అనుబంధంగా ఉన్న జీఎస్ఆర్ కార్డియాక్ సెంటర్ ఆధ్వర్యంలో సెంటి హాస్పిటల్‌లో మెగా ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని రాజాం మున్సిపల్ కమిషనర్ ఏ. రామచంద్రరావు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్తా సాయి ప్రశాంత్ ప్రారంభించారు.
సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరీ శంకర్ రెడ్డి మరియు రేడియాలజిస్ట్ డాక్టర్ దీపిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి సుమారు 100 మందికి పైగా రోగులు హాజరయ్యారు. వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితులపై నిపుణుల సలహాలు అందించారు. అదేవిధంగా రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రస్తుతం ఈ సెంటి హాస్పిటల్‌లో 24/7 జనరల్ మెడిసిన్ డాక్టర్ అందుబాటులో ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే పూర్తి సదుపాయాలతో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

Mega Free Medical Camp at senthans Hospital (Amirikan Hospital)

Vizianagaram District, Rajam:

A mega free medical camp was successfully organized at Senthans Hospital in Rajam town under the aegis of GSR Cardiac Center, affiliated with St. Ann’s Hospital. The camp was inaugurated by Rajam Municipal Commissioner A. Ramachandra Rao and noted industrialist Kotta Sai Prashanth.
The camp was conducted under the supervision of senior cardiologist Dr. Gouri Shankar Reddy and radiologist Dr. Deepika. More than 100 patients attended the camp, where they were provided with necessary medical check-ups and expert health consultations. Free medicines were also distributed to the patients.
On this occasion, the organizers stated that a 24/7 general medicine doctor is currently available at Senti Hospital. They also announced that all types of medical services with full-fledged facilities will be made available soon. People from the surrounding areas were encouraged to make use of these services.

239
11871 views

Comment