logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అహోబిలంలో ఆధ్యాత్మిక సంబరం.21 నుండి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు.

AIMA న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జయంతి ఉత్సవాలను ఈనెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు క్షేత్ర ప్రధాన అర్చకులు కిడాంబి మధుసూదన్ తెలిపారు. శనివారం రోజున ఆలయ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ప్రపంచంలో మరే ఇతర నరసింహ క్షేత్రంలో లేని విధంగా, కేవలం అహోబిలంలోనే ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడి విశిష్టత అని పేర్కొన్నారు. వైశాఖ మాసంలో స్వామివారు ఆవిర్భవించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ జయంతి ఉత్సవాలను (వైశాఖ బ్రహ్మోత్సవాలు) ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని.తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ స్వామివారు వివిధ రకాల అలంకరణలలో భక్తులకు దర్శనమిస్తారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగే ఈ వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి అని ఆయన వివరించారు.ఈ జయంతి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించాలని కోరారు.

64
2049 views

Comment