సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో మల్లెల రాజశేఖర్ దంపతులు ప్రత్యేక పూజలు: ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.
పాణ్యం (AIMA MEDIA): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామాల్లో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో టీటీడీ బోర్డు సభ్యుడు, జడ్పీ మాజీ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్ దంపతులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల నారాయణ శర్మ సిబ్బంది ఆలయ మర్యాదలైన పూర్ణకుంభంతో స్వాగతం పలికి శ్రీ స్వామివారికి అభిషేకములు, అర్చనలు పలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపము నందు శాలువాలు, శేష వస్త్రములు, పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదం, ప్రతిమ, కంకణ ధారణ చేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు క్రిష్ణయ్య స్వామి, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.