నల్లగా ఉన్నాడు అని.. భర్తని చంపిన.. భార్య..!!!
ఐమా న్యూస్ :- దంపత్య జీవితంలో భార్య భర్త లు సుఖా సంతోషం లో ఉండాలి అని అందరు కోరుకుంటారు.. కానీ నేటి సమాజం దానికి విరుద్ధంగా ప్రవర్తన వల్ల సంతోషంగా ఉండవలిసిన కుటుంబం అతలా కూతలంగా మారుతుంది దీనికి నిదర్షణమే ఈ కధ.. భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడు తో కుమ్మక్కు అయ్ భర్తని చంపిన భార్య కధ ఇది.. వివరాలు లోకి వెళ్తే...ఈ మహానటి అద్భుత నటన చూడండి .. భర్త నల్లగా ఉన్నాడని అతన్ని ప్రియుడుతో కలిసి హత్య చేయించి ఆ తర్వాత ఇలా ఏడుస్తోంది .. ఇంట్లో దోపిడీ దొంగలు దోచుకోవడానికి వచ్చి భర్తని చంపేశారంటూ స్క్రీన్ ప్లే అల్లింది .. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో జరిగింది ఈ ఘటన ..
27 ఏళ్ల ప్రియాంక పురోహిత్‌కు, 29 ఏళ్ల దేవ్ కృష్ణతో వివాహమైంది. దేవ్ కృష్ణ ఒక మసాలా దినుసుల వ్యాపారి. అతని భార్య ప్రియాంకకు సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం.
ప్రియాంక తరచూ దేవ్‌ను అతని నలుపు రంగు విషయంలో అవమానించేది. తనకు అంతకంటే మంచి వ్యక్తి దక్కాలని, దేవ్ తనకు తగడని తనను బయటకు తీసుకెళ్లడం లేదని, తన కోరికలు తీర్చడం లేదని నిందిస్తూ అతడిని వేధించేది. అంతేకాకుండా, ఆమె తరచూ అతడిని విచక్షణారహితంగా కొట్టేది.
దేవ్ ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినా, వారు దానిని తేలికగా తీసుకునేవారు. ఈ క్రమంలోనే ప్రియాంకకు కమలేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు దేవ్ సోదరి కనిపెట్టింది. ఆ బంధాన్ని ఆపేయమని దేవ్ ఆమెను బ్రతిమిలాడాడు.
కానీ, వారి అక్రమ సంబంధం కొనసాగింది. దేవ్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్రియాంక, కమలేష్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ను 1 లక్ష రూపాయలకు మాట్లాడుకుని, 50 వేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.
సోమవారం రాత్రి, తన ప్రియుడు కమలేష్ సహాయంతో ప్రియాంక ఒక నకిలీ దోపిడీ డ్రామా ఆడింది. వారు దేవ్‌ను దారుణంగా హత్య చేశారు. పోస్ట్‌మార్టం నివేదికలో దేవ్ తలపై 12 అంగుళాల లోతైన గాయం ఉన్నట్లు తేలింది.
మరుసటి రోజు ఉదయం, దొంగలు తనను బందీగా చేసి తన భర్తను చంపేశారని ఆమె ఏడుస్తూ నమ్మబలికింది. సుమారు 3.5 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని ఆరోపించింది. అయితే, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.