logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

25 వ తేదీ విజయవాడలో జరిగే నిరాహార దీక్షలను జయప్ర దం చేయండి: యుటిఎఫ్.

నంద్యాల (AIMA MEDIA ): పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న 4 డిఏ లను, పిఎఫ్,ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను అమలు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మెమో 57 అమలు చేయాలని,హెల్త్ కార్డు సమస్యలను పరిష్కారం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర సహా ధ్యక్షుడు కే సురేష్ కు మార్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నంద్యాలలో ప్రాంతీయంగా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమా వేశానికి ముఖ్యఅతిథిగా కే.సురేష్ కుమార్ హాజర య్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 30 వేల కోట్ల కు పైగా బకాయిలు పెట్టిందని, ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీ ఆ బకాయిలను అన్నిటిని పరిష్కారం చేస్తామని, పిఆర్సి కమిషన్ను వేస్తామని, పెండింగ్లో ఉన్న డి.ఏ లన్నిటిని కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారని, కానీ వీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటిపోయినప్పటికీ అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం బకాయిలు చెల్లిస్తూ పిఆర్సి కమిషన్ను దాటవే స్తున్నారని, పెండింగ్లో ఉన్న డిఎల గురించి పట్టించుకో వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీవీ ప్రసాద్, జె సుధాకర్ లు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అందుకే పోరాట మార్గమే సరైన మార్గమని ఈనెల 25,26,27 వ తేదీ లలో విజయవాడ అలంకార్ టాకీస్ దగ్గర ఫాఫ్టో ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిరాహార దీక్షలు చేపట్టామని , అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు రామకృష్ణుడు, నరసింహారెడ్డి, అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

0
58 views

Comment