మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విజయవంతంగా బంధు కార్యక్రమాన్ని నిర్వహించిన యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు SSU, SFI, MSF, PDSU.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించకుండా బడుగు బలహీన వర్గాల మహనీయులను యూనివర్సిటీ విసి అవమానించడాన్ని యావత్ విద్యార్ధి లోకం తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా యూనివర్సిటీ హాస్టల్స్ లో గత మూడు నెలలుగా కొనసాగుతున్న నీటి కొరతను తీర్చాలని, మెస్ బిల్లులు సమయానికి చెల్లించకపోవటం వలన విద్యార్థులకు సరుకులు సరైన సమయానికి అందక ఇబ్బందులు పడుతున్నారని,ఇంకా అనేకమైన సమస్యల పైన యూనివర్సిటీ అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ, యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల తీవ్ర అసహనంతో యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ SSU,PDSU, MSF, SFI, ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్ని కళాశాలలకు బంధువులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బందులో భాగంగా విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని విజయవంతంగా బందును నిర్వహించారు. విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ, యూనివర్సిటీలో మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుట గురించి మరియు యూనివర్సిటీ సమస్యల పైన తక్షణమే యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు మాచర్ల సుధీర్ మాదిగ,SSU అధ్యక్షులు సురేష్ స్వెరో,SFi నాయకులు రవి,అఖిల్ PDSU అధ్యక్షులు హర్ష తదితర విద్యార్థులు పాల్గొన్నారు