logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆటో డ్రైవర్ అంకూషావలీ సేవలు మొబైల్ చలివేంద్రంతో ప్రజలకు చల్లని నీరు!

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలోని యైటింక్లయిన్కాలనీకి చెందిన ఎండీ అంకూషావలీ ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. వేసవిలో ఆటోలో ప్రయాణించే వారితోపాటు.. ఆటోస్టాండ్ల వద్ద నీటి కోసం ఇబ్బందులు పడే వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. తన ఆటో సీటు వెనుక భాగంలో కూలెంట్ వాటర్ క్యాన్ను అమర్చి.. దానికి ప్లాస్టిక్ పైపు జోడించి.. కొళాయి బిగించారు. మొబైల్ చలివేంద్రం అనే పోస్టర్ను అంటించారు.

'నేను చేస్తున్న సేవను గుర్తించిన కొందరు తమ వంతుగా రోజూ 20 నుంచి 30 లీటర్ల చల్లని శుద్ధజలాన్ని అందిస్తున్నారని’ అంకూషావలీ వివరించారు.

2
244 views

Comment