logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామ సర్పంచ్

కామారెడ్డి ప్రతినిధి
తేదీ:18-04-2026

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామ సర్పంచ్

తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంలోని జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్ నీ నియమించినట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు కాయితీ ఆశాదీప్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్ కి నియామక పత్రాన్ని అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ వాణి వాసు యాదవ్ మాట్లాడుతూ సర్పంచ్ ల అభ్యున్నతికి, మరియు ప్రభుత్వం అందించే అభివృద్ధి పథకాలు అర్హులైన వారికి అందే విధంగా, ప్రజల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం గా పాటుపడతామని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది, జంగంపల్లి గ్రామ పాలక వర్గం,గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

86
4758 views

Comment