ఎల్ ఎన్ పేట కేజీబీవీ పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
AIMA న్యూస్ :
పాతపట్నం నియోజకవర్గం ఎల్‌ఎన్‌పేట మండలంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాను. వంటశాలలో పాడైపోయిన కూరగాయలు నిల్వ ఉంచడం గమనించి తీవ్రంగా మందలిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం బాధ్యతగా తీసుకోవాలని సూచించాను. మెనూ అమలులో లోపాలు ఉన్నాయని గమనించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాను. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రత లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సరిచేయాలని ఆదేశించాను. ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పనితీరులో మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు, Nara Lokesh గారు తీసుకువస్తున్న విద్యా సంస్కరణలకు అనుగుణంగా అందరూ సమన్వయంతో పనిచేసి విద్యా ప్రమాణాలను పెంచాలని సూచించాను.
#MamidiGovindaRao #Pathapatnam #Education
#SchoolInspection #QualityEducation #NaraLokesh