logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇద్దరు గంజాయి నిందితుల అరెస్ట్*

జర్నలిస్టు: మాకోటి మహేష్

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ కార్యక్రమాలకు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు.

నమ్మదగిన సమాచారం మేరకు టేకుమట్ల మండలం పోలీసులు కుందనపల్లి గ్రామానికి చెందిన *మాడుగుల ఉదయ్* కుమార్ S/o వీరయ్య,33 yrs అనునతడు తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నారని సమాచారం మేరకు టేకుమట్ల ఎస్ఐ గారు మరియు తన సిబ్బంది తో ఉదయ్ కుమార్ ఇంటికి చేరుకోగా అప్పుడే అట్టి మొక్కలకు నీరు పోస్తుండగా పోలీసు వారు అతడిని పట్టుకొని విచారించగా,అతనికి ఇంత కు ముందే గంజాయి తాగే అలవాటు ఉన్నది అని మరియు అతడు వావిలాల గ్రామానికి చెందిన *ఐలాపురం రాహుల్ S/o స్వామి* అనే వ్యక్తి తరచుగా గంజాయిని అమ్ముతాడాని చెప్పగా, అతని సమాచారం మేరకు రాహుల్ ని అదుపులోకి తీసుకొని విచారించగా తన వద్ద *రెండు ఎండు గంజాయి పొట్లాలు దొరికినవి.వాటిని తూకం వేయగా అందాజ 13 గ్రాములు* ఉంది.తదుపరి అట్టి ఎండు గంజాయి మరియు రెండు చెట్లని (live plant's) సీజ్ చేసి అట్టి ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు చేసి జైలు కి తరలించినట్లు *చిట్యాల సి.ఐ. D.మల్లేశ్* తెలిపారు. గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టేకుమట్ల ఎస్ఐ అమూల్యను మరియు సిబ్బంది వెంకటేష్, హారిశ్ లను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ గారు అభినందించారు.

0
125 views

Comment