logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రుద్రవరంలో పచ్చదనం పరిశుభ్రత, ప్రజారోగ్యం అంశంపై కళాత్మక ప్రదర్శన.

నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి దేవర శుభ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతీ అభివృద్ధి అధికారి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం నాడు పచ్చదనం పరిశుభ్రత మరియు ప్రజా ఆరోగ్యం సంబంధించిన అంశంపై ప్రజలలో చైతన్యం తీసుకొని రావాలనే ఉద్దేశంతో ప్రజల ఆయురారోగ్యాలతో ఉండడం కోసం వినోదభరితమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం నాడు తెలిపారు. ఈ సందర్భంగా రేపు శనివారం నాడు కర్నూల్ నారాయణ కళా జాతర బృందం కళాకారులతో రుద్రవరం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి పడమటి వీధి నంద్యాల రోడ్డు చివరి వరకు నాలుగు ముఖ్య ప్రదేశాలలో వినోదభరితమైన కార్యక్రమం వాహన సౌకర్యము తో ప్రోగ్రామ్ నిర్వహించటం జరుగుతుందనీ, ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి శుభ్రత పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు మరియు ప్రజలందరూ విజయవతం చేయాలని పంచాయతీ అభివృద్ధి అధికారి వడ్డే రామకృష్ణుడు పత్రికా సమావేశంలో తెలిపారు.

59
1981 views

Comment