ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి.
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును మండల ప్రత్యేక అధికారి అబ్దుల్ రహమాన్ శుక్రవారం నాడు ఆకస్మికముగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు మరియు పనితీరును పర్యవేక్షించి,అనంతరం విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రావణి మరియు డాక్టర్ శివ మోహన్ తో మాట్లాడుతూ వేసవికాలం మండల కేంద్రంలో సోమ, మంగళ వారాలలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి దేవర సందర్భంగా,ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలు ప్రజలకు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.