logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎక్సైజ్ శాఖలో “గోస్ట్ డ్యూటీలు”… కూర్చోకుండానే సంతకాలు..!* *స్టేషన్‌కు రాని ఎస్‌హెచ్‌ఓలు – రిజిస్టర్‌లో మాత్రం 31 రోజులు హాజరు..!*

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**మణుగూరు** ఏప్రిల్ 18 :(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


*ఎక్సైజ్ శాఖలో “గోస్ట్ డ్యూటీలు”… కూర్చోకుండానే సంతకాలు..!*

*స్టేషన్‌కు రాని ఎస్‌హెచ్‌ఓలు – రిజిస్టర్‌లో మాత్రం 31 రోజులు హాజరు..!*


*సమాచారం హక్కు చట్టం పై అవగాహన లేని అధికారులు..?*

*సీసీ కెమెరాలు లేవని సాకులు… ఖమ్మంలోనే కూర్చుని పాలన..?*

మణుగూరు, ఏప్రిల్ 18:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖలో సంచలన అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి!?. విధులకు హాజరుకాకుండానే రిజిస్టర్‌లలో సంతకాలు చేస్తూ “గోస్ట్ డ్యూటీలు” నిర్వహిస్తున్నారని మణుగూరు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి తీవ్రంగా ఆరోపించారు.శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వరావుపేట, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌హెచ్‌ఓలు నెలలో ఒకసారి మాత్రమే కనిపించి, మిగతా రోజులు కనిపించ కుండానే రిజిస్టర్‌ లలో సంతకాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
స్టేషన్‌కు వెళ్లిన ప్రజలకు “రైడ్‌లో ఉన్నాం” అంటూ తప్పించుకునే అధికారులు, వాస్తవానికి ఖమ్మంలోనే ఉంటూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని కర్నే రవి మండిపడ్డారు.ఆర్టీఐ చట్టం–2005 కింద సమాచారం కోరితే, స్టేషన్లలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, కొన్ని చోట్ల అసలు సీసీలు లేవని చెప్పడం మరింత అనుమానాలకు దారి తీస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే, అదే సమయంలో రిజిస్టర్‌ లలో మాత్రం నెలలో అన్ని రోజులు హాజరైనట్లు సంతకాలు ఉండటం అవినీతికి నిదర్శనమని విమర్శించారు.
“స్టేషన్‌ లో కనిపించని అధికారులు… రికార్డుల్లో మాత్రం పూర్తి హాజరు” అంటూ కర్నే రవి తీవ్రంగా స్పందించారు. విధులు నిర్వహించే పరిధిలో ఉండాల్సిన ఎస్‌ హెచ్‌ ఓ లు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఖమ్మం జిల్లా కమిషనర్ తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో పిల్ దాఖలు చేసి ఈ అవినీతి బహిర్గతం చేస్తానని కర్నే రవి హెచ్చరించారు.

152
4773 views

Comment