logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నెల్లూరు గోపాల్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

​బుచ్చిరెడ్డిపాలెం (కలయకాగొల్లు), ఏప్రిల్ 18:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు గోపాల్ రెడ్డిని శనివారం మాజీ మంత్రి, వైసిపి రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు.
​బుచ్చిరెడ్డిపాలెం మండలం కలయకాగొల్లు గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి గారు ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకొని ప్రస్తుతం వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారితో కలిసి కలయకాగొల్లులోని వారి స్వగృహానికి వెళ్లారు. గోపాల్ రెడ్డి గారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న వారు, ప్రస్తుతం అందుతున్న వైద్యం మరియు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ రమేష్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి, మాజీ సర్పంచ్ పగడాల శ్రీనివాసులు రెడ్డి, ఎంపీటీసీ శ్రీమతి జ్యోతి రమణి, పగడాల కృష్ణారెడ్డి, శెట్టిపల్లి వేణు మహేష్, కల్వగుంట రవి, సల్లా బుచ్చయ్య, అన్నారెడ్డి మల్లికార్జున్ రెడ్డి, పైనం ఇజ్రాయిల్, కుంచం అనిల్, పచ్చా శివయ్య, షేక్ రియాజ్, పైనం కిషోర్ కుమార్, దార్ల రవికుమార్, ఆమవరపు మురళి, పైనం వెంకయ్య, జమ్మలమడుగు రాజేష్, బత్తల క్రాంతి కుమార్, జ్యోతి శ్రీనివాసులు, పచ్చా పాల్సన్, కొప్పాల అంకాలయ్య మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు

9
557 views

Comment