అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు
ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా దగదర్తి మండలం కొత్తపల్లి కౌరగుంట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి మరియు ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పి.ఆర్.ఓ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ఉపాధ్యక్షుడు శ్రీ కోవూరు బాబురావు, ఆర్‌పీఐ స్టేట్ సెక్రటరీ లాయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ నాయకులు ఆయన చేసిన సేవలను కొనియాడారు.