logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చెన్నై-బెంగళూరు మధ్య కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ ఇవ్వాలని భారీ ర్యాలీ

చిత్తూరు జిల్లా పలమనేరు: చెన్నై- బెంగళూరు మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేపట్టినందువల్ల ఈ ట్రైన్ స్టాపింగ్ పలమనేరు నందు ఏర్పరచాలని పలమనేరు లోని విద్యార్థులు, ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. PPS అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ ఇస్తే బెంగళూరుకు 25 నిమిషాల్లో చెన్నైకి 45 నిమిషాల్లో చేరుకోవచ్చు, ఈ ప్రాంతాన్ని ఒక మెగా హబ్ గా మార్చవచ్చు, చెన్నై- బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్, ఇంటి అద్దె భారం లేకుండా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగులు పలమనేరు నుండి ప్రతిరోజు విధులకు వెళ్లి రావచ్చు దీనివలన నగరాల ఒత్తిడికి పరిష్కారం లభిస్తుంది. పరిశ్రమలు అభివృద్ధి చెంది హై స్పీడ్ కనెక్టివిటీ ఉంటే పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడ స్థాపించవచ్చు అంతేకాక రైతులు పండించే కూరగాయలు, పూలు, పాలు అతి తక్కువ సమయంలో మెట్రో నగరాల మార్కెట్లకు చేరి అక్కడ రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. రవాణా సౌకర్యం పెరిగితే స్థానిక వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ కు, విద్యాసంస్థలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. జపాన్లో ప్రతి 30 కిలోమీటర్ల కు ఒక స్టేషన్ ఉంటుంది కానీ ఇక్కడ రామాపురం-కోలార్ మధ్య 80 కిలోమీటర్ల గ్యాప్ ఉంది మధ్యలో ఉన్న పలమనేరు రెవిన్యూ డివిజన్ స్టేషన్కు సర్వ అర్హతలు కలిగి ఉంది అన్నారు. పలమనేరుకు కర్ణాటక బార్డర్ సుమారు 29 కిలోమీటర్లు అదేవిధంగా తమిళనాడు బార్డర్ సుమారు30 కిలోమీటర్లు ఉన్నందున ఈ ప్రాంతము ఏ విధంగానూ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కావున పలమనేరు ప్రజల ఆకాంక్ష మేరకు బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ ఇవ్వాలని ఈరోజు భారీ ప్రజా బాధ్యత ర్యాలీ నిర్వహించారు.

43
3279 views

Comment