జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మండలంలో
నిర్మాణం అవుతున్న పలు భవనాల పరిశీలన
జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మండలంలో
నిర్మాణం అవుతున్న పలు భవనాల పరిశీలన
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంతో పాటు యశ్వంతరావు పేట గ్రామంలో శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. యశ్వంతరావుపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం బుగ్గారంలోని
ఎదుల బోర్లలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం,
మూడు గ్రామ సమైక్య భవనాల నిర్మాణం,
మండల తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల భవనాల నిర్మాణ పనులను,
నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు.
ఆయా కాంట్రాక్టర్ లతో, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో, సంబంధిత శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. నిర్మాణ పనులు త్వరగా, నాణ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపులు కూడా త్వరలోనే అవుతాయని, పనులు ఆలస్యం కాకూడదని తెలిపారు.
డీఆర్డీఏ పిడి రఘువరన్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్ గౌడ్, మండల తహసీల్దార్ భూమేశ్వర్, ఇంచార్జ్ ఎంపిడివో అనుమల్ల వాసవి, ఎపిఎం రమాదేవి,
వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, బుగ్గారం సర్పంచ్ నక్క రాజవ్వ, ఉప సర్పంచ్ జంగ లావణ్య, వార్డ్ సభ్యులు బెజ్జారపు రాజు, పంచాయతీ కార్యదర్శి అక్బర్, విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి కోర్ కమిటీ చైర్మన్ పెద్దనవేని రాగన్న, కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్ తదితరులు ఉన్నారు.