కడప నగరం మున్సిపాలిటీ కమిషనర్ మార్నింగ్ విజిట్
ప్రెస్ నోట్
కడప నగరపాలక సంస్థ
తేదీ: 17-04-2026
కడప నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ రాకేష్ చంద్ర గారు నేడు మార్నింగ్ విజిట్‌లో భాగంగా వెస్ట్ జోన్ పరిధిలోని 43, 44, 45 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
అదేవిధంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ జరుగుతున్న విధానాన్ని కూడా పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
ప్రజలు తడి చెత్త మరియు పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి ఇవ్వడం ఎంతో ముఖ్యమని, ఇది పర్యావరణ పరిరక్షణకు మరియు సమర్థవంతమైన చెత్త నిర్వహణకు దోహదపడుతుందని కమిషనర్ గారు తెలియజేశారు.
నగర పరిశుభ్రతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, నగరపాలక సంస్థతో సహకరించాలని ప్రజలను కోరారు.