logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆదిలాబాద్, ఈ రోజు: ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై సాధ్యత అధ్యయనం కోసం రక్షణ శాఖ అధికారులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు

*, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా ఫీల్డ్ విజిట్ నిర్వహించారు*

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ సాధ్యతపై రక్షణ శాఖ, AAI మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో అధ్యయనం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ ఫీల్డ్ విజిట్‌ను ఏర్పాటు చేయడం ఆనందకరమని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం, సంబంధిత కేంద్ర మంత్రులు మరియు తెలంగాణ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వస్తుందని ఎమ్మెల్యే గారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు

0
0 views

Comment