logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బుగ్గారం మండల అభివృద్ధికి అందరూ కృషి చేయాలి : - స్పెషల్ ఆపీసర్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారిణి సుజాత - మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దాం : వాసవి

బుగ్గారం మండల అభివృద్ధికి అందరూ కృషి చేయాలి :

- స్పెషల్ ఆపీసర్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారిణి సుజాత


మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దాం :

- ఎంపిడివో అనుమల్ల వాసవి

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి :
- తహసీల్దార్ భూమేశ్వర్

100 శాతం హాజరైన సర్పంచ్ లు

విజయ వంతమైన బుగ్గారం మండల స్థాయి సమావేశం


పత్తా లేని ఎక్సైజ్, వెటర్నరీ శాఖల అధికారులు

బుగ్గారం / జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ ముత్యాల పోచమ్మ - నల్ల పోచమ్మ ఆలయాల ఫంక్షన్ హాల్ లో గురువారం మండల స్థాయి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సమావేశం ఇంచార్జ్ ఎంపిడివో అనుమల్ల వాసవి అధ్యక్షతన విజయవంతమైంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న " ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక, 99 రోజుల ఆక్షన్ ప్లాన్" లో భాగంగా గురువారం మండలంలోని 10 గ్రామాల ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో మండల స్థాయి సమావేశం ఎంపిడివో అనుమల్ల వాసవి అధ్యక్షతన నిర్వహించారు.
దీపారాధన అనంతరం తెలంగాణ గీతం, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల ఆక్షన్ ప్లాన్ లో భాగంగా మండలంలోని పది గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాల వీడియో లను, ఫోటోలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రదర్శించి సభికులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల స్పెషల్ ఆపీసర్ అయిన జిల్లా బిసి వెల్ఫేర్ అధికారిణి సుజాత ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. నూతనంగా ఏర్పడిన బుగ్గారం మండల అభివృద్ధికి అందరూ కృషి చేసి ఆదర్శ మండలంగా తీర్చి దిద్దుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన నిరుపేదలు తప్పని సరిగా పొందాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజా ప్రభుత్వంగా ఏర్పడ్డ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత రెండున్నర ఏండ్ల లో చేసిన అభివృద్ధి పనులను, అమలు పరిచిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రజలకు అందిస్తున్న సేవలను, మండల పరిధిలో గల వనరులను, లబ్ధిదారులుగా ప్రజలు పొందిన లబ్ధిని ఉద్దేశించి ఆయా శాఖల అధికారులు వివరించారు.

మండల తహసీల్దార్ భూమేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను, భూ భారతి లో జరిగిన మార్పులను, వివిధ పథకాల ద్వారా
మండలంలోని ప్రజలు పొందుతున్న సేవలను, లబ్ధిని ఆయన వివరించారు.

సభాధ్యక్షులైన ఇంచార్జ్ ఎంపిడివో అనుమల్ల వాసవి మాట్లాడుతూ మండలంలోని పది గ్రామాలలో జరుగుతున్న ప్రజా పాలన గురించి వివరించారు. సర్పంచ్ లు, వార్డ్ సభ్యులైన ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి కట్టుగా ఉండి ప్రజలకు కావాల్సిన వసతులన్నీ కల్పించి ఆయా గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. అందరం కలిసి మన బుగ్గారం మండలాన్ని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్దామని ఆమె తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ - మీ సర్పంచ్ ల ద్వారా మా దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారం కోసం మేము కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంపిడివో అనుమల్ల వాసవి హామీ ఇచ్చారు. 100 శాతం అనగా 10 గ్రామాలకు 10 గ్రామాల నూతన సర్పంచ్ లు వేదికనలంకరించి వారి - వారి సందేశాల ద్వారా ఆయా గ్రామాల ప్రజల యొక్క సమస్యలను, ప్రజా పాలనను వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిన లబ్ధిని, జరిగిన అభివృద్ధి పనులను వివరించారు.
మండల విద్యాధికారి సురోజు వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారిణి అక్షిత,
విద్యుత్ శాఖ ఎ.ఈ. పూరెల్ల రాజ శేఖర్, వైద్య, ఆరోగ్య శాఖా వైద్యాధికారిణి ఆస్మా, సిహెచ్ ఓ శాంతిశ్రీ, హెల్త్ సూపర్ వైజర్ సులోచన, ఐసిడిఎస్ సిడిపిఓ వాణిశ్రీ, ఎసిడిపిఓ మౌనిక, సూపర్ వైజర్ నీలిమ, డి.ఆర్.డి.ఎ. మండల ఎపిఎం రమాదేవి, సీసీ పద్మ, పిఆర్ ఏఈ మహేందర్, ఇరిగేషన్ ఏఈ లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని మాట్లాడారు.

సామాజిక కార్యకర్త, తెలంగాణ జన సమితి పార్టీ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల సమస్యలను, ప్రజా సమస్యలను, మండల అభివృద్ధి పనులను, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, అంగన్ వాడి, తదితర సమస్యలను అధికారుల దృష్టికి, నూతన సర్పంచ్ ల దృష్టికి తీసుకు వెళ్లారు. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మద్దునూరు మాజీ సర్పంచ్ బత్తుల తిరుపతి తదితరులు పాల్గొని ప్రసంగించారు.


అంగన్ వాడి సెంటర్ల ద్వారా అందజేస్తున్న పోషకాహారాల పట్ల, వాటి విలువలు, వినియోగం పట్ల సమావేశానికి హాజరైన అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.
పంచాయతీ కార్యదర్శుల సంఘం ద్వారా ప్రత్యేకంగా ముద్రించబడిన డైరీని మండల కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు సిద్ధం సతీష్ ఆధ్వర్యంలో తన కార్యదర్శుల బృందంతో కలిసి ఈ సభలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకుల చేతుల మీదుగా నూతన డైరీని ఆవిష్కరించారు.
వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు,
వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, అంగన్ వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, వివిధ గ్రామాల వార్డ్ సభ్యులు, ప్రజలు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కారోబార్ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




పత్తా లేని ఎక్సైజ్, వెటర్నరీ శాఖ లు

బుగ్గారం మండల కేంద్రంలో గురువారం జరిగిన మండల స్థాయి సమావేశం కు ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు, పశు వైద్యాధికారులు హాజరు కాకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్నారు. వీరి వలన అనేక మంది ప్రజలు, రైతులు తీవ్ర నష్టాలకు గురి కావడం జరుగుతుందన్నారు.
పలు గ్రామాల ప్రజలతో పాటు సామాజిక కార్యకర్త చుక్క గంగారెడ్డి ఎక్సైజ్, వెటర్నరీ శాఖల అధికారులపై పలు ఆరోపణలతో కూడిన విమర్శలు చేశారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న శాఖల అధికారులను ఆయన సభా ముఖంగా కొనియాడారు. మండల ప్రజల పక్షాన బెస్ట్ సర్వీస్ చేస్తున్న శాఖల అధికారులకు చుక్క గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.



ఉత్తమ సేవలు అందించండి - నేషనల్ అవార్డ్ లు అందుకోండి :

చుక్క గంగారెడ్డి


ఉత్తమ సేవలు అందించండి - ఉత్తమ సేవల నేషనల్ అవార్డ్ లు అందుకోండి అని అవార్డుల సెలెక్షన్ కమిటి సభ్యుడు చుక్క గంగారెడ్డి స్థానిక ఎంపిడివో అనుమల్ల వాసవి ద్వారా ఈ సమావేశంలో ఒక ప్రకటన చేయించారు.

బుగ్గారం మండలంలో ప్రజల మన్ననలు పొందే విధంగా కృషి చేసిన ఏవైనా రెండు శాఖల బెస్ట్ అధికారులకు, ఉత్తమ పరిపాలన చేసిన ఎవరైనా ఇద్దరు సర్పంచ్ లకు జాతీయ స్థాయి ఉత్తమ సేవల అవార్డ్ లు ఇప్పిస్తామని చుక్క గంగారెడ్డి ప్రకటనలో తెలిపారు.

ఈ నేషనల్ అవార్డ్" లను బహుజన సాహిత్య అకాడమీ జాతీయ సంస్థ ద్వారా ఇప్పిస్తానని నేషనల్ అవార్డ్ ల సెలెక్షన్ కమిటి సభ్యుడు చుక్క గంగారెడ్డి ఈ సభా ముఖంగా ఎంపిడివో ద్వారా ప్రకటన చేయించారు. అధికారులు, సర్పంచ్ లు మీ - మీ స్థాయిలో మంచి సేవలు అందించి ప్రజలచే మెప్పు పొందాలని వారు కోరారు. ఉత్తమ సేవలు అందించి మంచి పనులు చేసిన ప్రజా ప్రతినిధులను, అధికారులను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని వారు వివరించారు.

6
47 views

Comment