అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గృహ అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
కామారెడ్డి ప్రతినిధి
తేది :16.04.2026
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్జీవోస్ కాలనీలో
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గృహ అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించబడింది.
జిల్లా అగ్నిమాపక అధికారి ఆర్. సుధాకర్ , ఇన్‌చార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఆర్. రవీందర్ రెడ్డి,అగ్నిమాపక సిబ్బంది కలిసి ఎన్‌జీఓస్ కాలనీని సందర్శించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందు ప్రియ కాలనీవాసులు హాజరయ్యారు. గృహ అగ్నిప్రమాదాల నివారణ, వాటిని సమర్థంగా ఎదుర్కొనే విధానాలపై అవగాహన కల్పించబడింది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ వంట గది అగ్నిప్రమాదాలు నూనెతో సంభవించే అగ్నిప్రమాదాలపై ప్రత్యేకంగా వివరించారు.
“స్టాప్, డ్రాప్ అండ్ రోల్” పద్ధతి, చిన్న అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు బ్లాంకెట్ ఉపయోగించే విధానం వంటి భద్రతా చర్యలను ప్రదర్శించారు. అలాగే ఎల్పీజీ సిలిండర్లను సురక్షితంగా వినియోగించే విధానం, అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ప్రాయోగిక సూచనలు అందించారు.
కాలనీ నివాసులు చురుకుగా పాల్గొని అగ్నిమాపక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
అదేవిధంగా ఫైర్ సర్వీస్ వీక్ 2026 సందర్భంగా జిల్లాలోని ఇతర ఫైర్ స్టేషన్ల అధికారులు సిబ్బంది తమ తమ పరిధిలో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని
జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్
తెలిపారు.