ఆర్ఎంపిఐ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దాసరి జయచంద్ర పిల్లల విద్యా ప్రతిభ అభినందనలు
భారత విప్లవ మార్క్సిస్ట్ పార్టీ (ఆర్.ఎం. పి. ఐ) తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దాసరి జయచంద్ర కార్మిక సమస్యలపై, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ ప్రజా నాయకుడిగా, కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందారు.
ప్రజా ఉద్యమాల్లో, కార్మిక హక్కుల సాధనలో ముందుంటూనే తన పిల్లలను విద్యలో రాణించేలా తీర్చిదిద్దడంలో ఆదర్శంగా నిలిచారు. కామ్రేడ్ జయచంద్ర కుమార్తె, కుమారుడు ఇద్దరూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణం.
విద్యా ప్రతిభ వివరాలు:
1. కుమార్తె దాసరి వర్ష: ఇంటర్మీడియట్ బై.పి.సి లో 1000 మార్కులకు 985 మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు.
2. కుమారుడు దాసరి శ్యామ్ రాజ్: టెన్త్ సి బిఎస్ఈ బోర్డు పరీక్షలో 500 మార్కులకు 487 మార్కులు సాధించి రాయలసీమ ప్రథమ ర్యాంకు తో పాటు నేషనల్ ర్యాంక్ కూడా సాధించారు.
_"ప్రజల హక్కుల కోసం వీధుల్లో తండ్రి పోరాటం, దేశ భవిష్యత్తు కోసం తరగతి గదుల్లో పిల్లల పోరాటం - ఇదే నిజమైన విప్లవ వారసత్వం"_ అని పార్టీ పేర్కొంది.
ఉద్యమ నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుటుంబాన్ని విద్యావంతంగా తీర్చిదిద్దిన కామ్రేడ్ దాసరి జయచంద్ర, ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ విష్ణు శివ జ్యోతి కి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దాసరి. వర్ష, దాసరి. శ్యామ్ రాజ్ లకు భారత విప్లవ మార్క్సిస్ట్ పార్టీ ఆర్ఎంపిఐ తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
వీరి స్ఫూర్తి నేటి విద్యార్థి లోకానికి, కార్మిక కుటుంబాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.