logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయాలనే దారుణమైన కుట్ర..

విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయాలనే దారుణమైన కుట్ర..

సుపారీ హత్యకు ప్లాన్ చేసిన తండ్రి..

రెండో భార్యతో కలిసి మొదటి భార్య పిల్లలను చంపేయాలనుకున్నాడు..

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో తరిగొప్పుల మండలం ఆంక్షాపూర్ గ్రామానికి చెందిన అనిత తన ఇద్దరు కుమారులు.. ( ఒకరికి ఆరేళ్లు, ఇంకొక అబ్బాయి తొమ్మిదేళ్లు) తో కలిసి నివాసముంటోంది..

భర్త ఏడాది క్రితం శ్రీనివాస్ దుబ్బతండాకు చెందిన మూడావత్ మమతను రెండవ పెళ్లి చేసుకోగా.. అనిత పోలీసులను ఆశ్రయించింది..! దీంతో పోలీసులు సమస్య పరిష్కారం కోసం చేసిన సూచనలతో... తండాకు చెందిన పెద్దమనుషులతో పంచాయతీ ఏర్పాటు చేయించింది..

ఇద్దరు పిల్లల పేరిట ఇరవై గుంటల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని పెద్దమనుషులు తీర్మానించారు..

దీంతో ఆ భూమి సాగు చేసుకుంటు కూలీ పనులు చేస్తూ అనిత పిల్లల బాగోగులు చూసుకుంటోంది..

కొద్దిరోజులకు తన భూమి తనకు ఇవ్వాలని శ్రీనివాస్ అనితను వేధించడం మొదలుపెట్టడంతో మరోసారి అనిత పోలీసులను ఆశ్రయించింది..

దీంతో శ్రీనివాస్ ఎలాగైనా భూమిని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్మాదపు ఆలోచన చేశాడు.. రెండో భార్యతో కలిసి అనిత పిల్లలను అంతమొందించేందుకు ప్లాన్ రూపొందించాడు..

స్కూల్ కు వెళ్ళే ఇద్దరు కుమారులకు ఎలాగైనా విషం కలిపిన బిస్కట్లు తినిపించాలని ప్లాన్ చేశాడు.. అనుకున్న ప్రకారం ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చి అతని ద్వారా పిల్లలకు బిస్కట్లు తినిపించాలని చూసాడు..

అయితే సుపారీ ఒప్పందం చేసుకున్న వ్యక్తి మానవత్వంతో ఆలోచించి... నేరుగా శ్రీనివాస్ కుట్ర విషయాన్ని అనితకు చెప్పాడు.. దీంతో అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది..

కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ సహా అతని రెండవ భార్య మమతను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు..

ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.. రెండు మండలాల పరిధిలో ఉన్న తండాల వాసులు నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...

వారిద్దరిని తండాకు మళ్లీ రాకుండా బహిష్కరించాలని అభిప్రాయపడుతున్నారు..

19
450 views

Comment