logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజలకు* *నాణ్యమైన సేవలు అందాలి.... పియూసి* *చైర్మన్ & ఎమ్మెల్యే కూన రవికుమార్* *గారు

AIMA న్యూస్ శ్రీకాకుళం :
ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజలకు* *నాణ్యమైన సేవలు అందాలి.... పియూసి* *చైర్మన్ & ఎమ్మెల్యే కూన రవికుమార్* *గారు*

👉 పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (PUC) సమావేశం ఈ రోజు అమరావతిలోని వెలగపూడి శాసనసభ కార్యాలయంలో ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు అధ్యక్షతన నిర్వహించబడింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ సంస్థల గత ఐదేళ్ల ఆదాయ, వ్యయాలు, వార్షిక నివేదికలు మరియు సాధారణ కార్యకలాపాలను సమీక్షించేందుకు ఈ సమావేశం జరిగింది.

👉ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై సమగ్ర చర్చ జరిగింది. ఈ సమావేశంలో మొదటగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (APSRTC), ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (APPDCL), ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (APPFCL) సంస్థల పనితీరును కమిటీ సభ్యులు పరిశీలించారు.

👉సమావేశంలో ఆయా సంస్థల ఉన్నత అధికారులు హాజరై తమ సంస్థల ప్రగతి, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై కమిటీకి వివరణ ఇచ్చారు. కమిటీ సభ్యులు సంస్థల పనితీరుపై ప్రశ్నలు అడిగి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా సూచనలు చేశారు.

👉ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని కమిటీ చైర్మన్ గారు మరియు సభ్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

👉ఈ సమావేశంలో పియుసి కమిటీ సభ్యులైన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన గారు మరియు పియుసి అధికారులు పాల్గొన్నారు.

2
484 views

Comment