logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ZPHS బుచ్చెంపెటలో విద్యార్థుల నమోదు కార్యక్రమం: HM వరలక్ష్మి 'నాణ్య విద్యకు హామీ'

అనకాపల్లి: జిల్లా బుచ్చెంపెట జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో శ్రీమతి SVS వరలక్ష్మి హెడ్‌మాస్టర్‌గా, చైర్మన్ చిటికెల వెంకటరమణ, ఉపాధ్యాయులు రాము, కనకరాజు, నర్సింహామూర్తి, భాస్కరరావు, వీరబాబు ఆధ్వర్యంలో విద్యార్థుల నమోదు కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యకు పూర్తి హామీ ఉందని HM గారు మాట్లాడుతూ తెలిపారు. మెరుగైన కెరీర్ కోర్సుల్లో చేరి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని విద్యార్థులను కోరారు. పాఠశాల HM, స్టాఫ్ సహకారం, నిరంతర కృషితో విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తున్నారని ప్రస్తావించారు.
ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన కంప్యూటర్ విజ్ఞానం, సాఫ్ట్ స్కిల్స్‌పై గట్టి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నామని HM వరలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, తల్లిదండ్రులు పాల్గొని పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

16
498 views

Comment