logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వివాహేతర సంబంధం కోసం భర్తను సజీవ దహనం చేసిన భార్య*

*వివాహేతర సంబంధం కోసం భర్తను సజీవ దహనం చేసిన భార్య*

*ప్రియుడు, సుపారీ గ్యాంగ్ తో కలిసి పాశవిక హత్య – పరకాలలో సంచలనం*

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మడికొండ సుమన్ (35) ఈనెల 3వ తేదీ నుంచి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

దర్యాప్తులో బయటపడిన విషయాలు షాకింగ్‌గా మారాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సుమన్‌ను అతని భార్య లావణ్య అత్యంత పాశవికంగా హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

సుమన్ భార్య లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ఈ నేపథ్యంలో భర్తను అడ్డంకిగా భావించిన లావణ్య, తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.

ప్రియుడు సహా మరో 8 మంది సుపారీ గ్యాంగ్ సభ్యులను తీసుకొని ఈనెల 4న ములుగు జిల్లా దయ్యాలవాగు సమీపానికి సుమన్‌ను తీసుకెళ్లి, అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

6
155 views

Comment