logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోలుగుంట జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో ఘనవిజయం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. విద్యార్థుల అసాధారణ ప్రతిభ, అధ్యాపకుల అవిరామ కృషి ఈ విజయానికి కారణమని ప్రిన్సిపల్ ఎం. అప్పలరాజు తెలిపారు.
మొదటి సంవత్సరం పరీక్షలకు 156 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 120 మంది ఉత్తీర్ణులై 77 శాతం ఉత్తీర్ణత రేటు వచ్చింది. రెండవ సంవత్సరం పరీక్షల్లో 144 మంది పైగా 121 మంది (84 శాతం) పాసయ్యారు. ఈ ఫలితాలు కళాశాల చరిత్రలో మైలురాయిగా నిలిచాయి.
రెండవ సంవత్సరం MPC విభాగంలో యం. మేదశ్రీ 1000 మార్కులకు 981 మార్కులు సాధించి అనకాపల్లి జిల్లాలో మొదటి స్థానం సొంతం చేసుకుంది. మొదటి సంవత్సరం BIPCలో కె. వంశిత 455లో 446 మార్కులు (98 శాతం) పొంది కళాశాల మొదటి స్థానం, MPCలో ఆర్. సరత్ కుమార్ 470లో 459 మార్కులు (97.6 శాతం) సాధించి రెండో స్థానం దక్కించుకున్నారు.
కళాశాల ప్రిన్సిపల్ ఎం. అప్పలరాజు పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, "మా విద్యార్థుల ఈ రికార్డు ఫలితాలు అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదలకు ప్రతీక. వైస్ ప్రిన్సిపల్ సాయి మాస్టారు (సహ దేవుడు) అద్భుత మార్గదర్శకత్వంతో మా కళాశాల జిల్లా విద్యా రంగంలో అగ్రస్థానం స్థిరపరుస్తోంది. ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు" అని ఘనంగా తెలిపారు.
ప్రిన్సిపల్ అప్పలరాజు, వైస్ ప్రిన్సిపల్ సాయి మాస్టారు, అధ్యాపక సిబ్బంది కలిసి ఉత్తీర్ణ విద్యార్థులను అభినందించారు.

0
579 views

Comment