రంగబోయినిభాగ్య(రూపి) మృతదేహంస్వగ్రామంలో అంత్యక్రియలు
చత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో సిద్దిపేట జిల్లా భాగ్య అలియాస్ రూపి మృతి
సొంత గ్రామానికి చేరిన భాగ్య
మృతదేహాన్ని స్వగ్రామానికి చేరింది
చత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్, తెలంగాణలో దుఃఖాన్ని మిగిల్చింది పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమాండర్ రూపి అలియాస్ భాగ్య మృత్యువాత పడింది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భాగ్య ఆలియాస్( రూపీ) 2002 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరింది అప్పటినుండి భాగ్య మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఏరియా కమాండర్ వరకు ఎదిగింది ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చ్ 31 లోపు లొంగిపోవాలని పిలుపునిచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు మావోయిస్టులు మాత్రం లొంగిపోవడానికి నిరాకరించారు ఈ నేపథ్యంలో చత్తీస్ గడ్ లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కమాండర్ భాగ్య మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలపడంతో, ధర్మారం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి నిరుపేద కుటుంబానికి చెందిన భాగ్య కుటుంబ సభ్యులు చివరి చూపుకైనా మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చే విధంగా చూడాలని వేడుకుంటున్నారు తమ బిడ్డ చనిపోయిందని తల్లితోపాటు కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి సుమారు 24 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న భాగ్య ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తుందని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు, చనిపోయిందని తెలియడంతో గుండెలు బాదుకుంటూ కూతురి ఆఖరి చూపు కోసం రోదిస్తూ ఎదురుచూస్తున్నారు కనీసం తినడానికి తిండి కూడా లేని కుటుంబం నుండి మావోయిస్టు పార్టీలో చేరిన భాగ్య పోలీసుల కాల్పులు చనిపోవడం బాధాకరమని, కనీసం కుటుంబ సభ్యుల కోరిక మేరకు భాగ్య మృతదేహాన్ని స్వగ్రామానికి చేరింది.