నకిరేకల్‌లో “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమం – ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు
నకిరేకల్ పట్టణం :-
నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్ గారు, మండల విద్యాధికారి మేకల నాగయ్య గారు, స్థానిక కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందిస్తున్నామని తెలిపారు.