పూజల పేరిట రూ.10 లక్షల మోసం… ప్రధానోపాధ్యాయుడు రిమాండ్‌కు
మహబూబాబాద్ జిల్లాలో పూజల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మా నిజం కు తెలిసిన సమాచారం మేరకు, స్టేషన్ గుండ్రాతి మడుగు కు చెందిన జాడ్పోడ్ ప్రతాప్, తండ్రి: తారాసింగ్, రాజోలు ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిజం చెపుతాం న్యూస్ కు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు, 2025 సంవత్సరంలో తునగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి వద్ద పూజలు నిర్వహిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తే మరిన్ని విరాళాలు వస్తాయని నమ్మబలికి ఒప్పందం కుదుర్చుకుని మోసం చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు.
తరువాత ఆ డబ్బులతో ఖమ్మం పట్టణంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధంగా పూజల పేరిట మరికొంతమందిని మోసం చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కురవి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు సమాచారం.
రాజోలు ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యార్థులకు సన్మార్గం చూపాల్సిన వ్యక్తి మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు సేకరిస్తున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజం చెపుతాం న్యూస్ కు తెలిసిన సమాచారం మేరకు, ఇదే ప్రధానోపాధ్యాయుడు గతంలో మహబూబాబాద్ మండలం కట్టెలమండి ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పుడు విద్యార్థినులకు అశ్లీల చిత్రాలను చూపించడనే ఆరోపణలతో మహబూబాబాద్ పోలీస్ స్టేషన్‌లో పొక్సో చట్టం క్రింద కేసు నమోదు అయి జైలుకు వెళ్లినట్లు పలువురు గుర్తు చేస్తున్నారు.
ఇతని పై పలు పిర్యాదులు ఉండి, విచారణ అధికారులు నివేదికలు సమర్పించినప్పటికి, చర్యలు తీసుకోకుండా ఇంత కాలం ఉదాసిన వైఖరి ప్రదర్శించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నిస్తూ, సంబంధిత విద్యాశాఖాధికారులు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.