logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ రావులతో జరిగిన సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుపై ఆయన తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా డీలిమిటేషన్ బిల్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాదికి ఉన్న 24% సీట్లు తగ్గకుండా, కనీసం 50% పెరగాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాతే పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

అదే సమయంలో, ఈ నెల 20న జరిగే జగిత్యాల సభ, 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.

0
440 views

Comment